#460సువార్త ప్రకటన
Author: పులిపాక జగన్నాథముComposer/Ragam: హరికాంభోజిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
చాటుడి శుభవార్తను – బోధకులారా – చాటుడి శుభవార్తను – చాటుడి శుభవార్త – సకల
రాష్ట్రములలో – చాటించుడని చెప్పె – దాటిగా ప్రభు యేసు ॥ చాటుడి ॥
1.
లోకమును ప్రేమించి – లోక రక్షణ కొరకు – ప్రాకట
ంబుగా సుతుని – బంపె దేవుడటంచు ॥ చాటుడి ॥
2.
శత్రువుల రక్షింప – మిత్రుడుగా వచ్చి –
మైత్రి నసువు నిచ్చి – మరల లేచెనటంచు ॥ చాటుడి ॥
3.
ఎట్టి పాపులైన – బట్టి యేసుని మాట – దిట్టము
గా నమ్మిన – బట్టుగా క్షమియించును ॥ చాటుడి ॥
4.
హృదయ శుద్ధిని గోరి – సదయుడగు రక్షకుని –
పదిలముగా ప్రార్థింప – పరిశుద్ధాత్మ నొసంగును ॥ చాటుడి ॥
5.
నమ్మి బాప్తిస్మము – నెమ్మది బొందిన మనుజు –
లిమ్ముగా బొందుదురు – ఇలను ఘన రక్షణము ॥ చాటుడి ॥
6.
ఇందు నందు మీకు – బొందుగా నొసంగు
ను – సంధియము లేకుండ సకల భాగ్యములనుచు ॥ చాటుడి ॥