#459ఎవరు ప్రభుని పక్షమున నున్నారు?
Author: టి. గురవయ్యComposer/Ragam: యదుకులకాంభోజిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ఎవరు క్రీస్తు వైపు నున్నారు – ఎవ రేసుని వారు – రాజౌ
దివ్య యేసు ప్రభుని కొరకై – యెవరు సేవ చేయుచు నుందు ॥ నెవరు ॥
1.
నాశనం బగు నాత్మల కెల్ల – నాశ్రయ
రక్షకుడౌ – క్రీస్తు – యేసును దెల్ప లోకమును – విసర్జించి సేవ చేయ ॥ నెవరు ॥
2.
లయము గాని యేసు శక్తియే – జయము పొందును – ఆయన – ప్రియమౌ సేనయందు జేరి – సాతాను నెదిరించి గెలువ ॥ నెవరు ॥
3.
మరణము నందు గూడ మాకు – గరుణ జూపిన యేసు నీ కొ – మరులమై మేమందరము నీ – దరికి జేరి యు
న్నాము ॥ ఎవరు ॥