#462యేసును వెంబడించుము
Author: ఎ. చార్లెస్ కిన్సింగర్Composer/Ragam: శంకరాభరణముCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
జయ ప్రభు యేసుని వెంబడించుచు – జయముగా నడచెదము – యేసుతో
జయముగా వెడలెదము – ప్రియుడగు యేసుని
ప్రేమను చవిగొని – పయనము చేసెదము మా ప్రభు వెంబడి ॥ జయప్రభు ॥
1.
ఆదరణయు నధిక బలమును ఆత్మఖడ్గమును – అవనిలో నందరి రక్షయును – ఆదర్శంబౌ
ఆయన వాక్యమే – అనిశము మనకిల మార్గము చూపగా ॥ జయప్రభు ॥
2.
ధర విరోధులు మమ్ము జుట్టగా – దరి జేరెద మేసున్ – ప్రభుని దరిజేరెద
మేము – ధాత్రి దురాశలండంబులన్నిటి – మైత్రిని వీడి నడచెద మేసుతో ॥ జయప్రభు ॥
3.
మా ప్రభు ఈవుము నీదు మార్గపు – మాదిరి జాడలను – నీ దగు –
మాదిరి జాడలను – మా పాదములను దొట్రిల్లకుండగా – మా కడు బలమును మీ కృపా దివమున ॥ జయప్రభు ॥
4.
మా కొరకై నీవు నడిచిన – మార్గము చూడగను – మేము మార్గము చూడగను
– మా రక్షక నీ అడుగుజాడలు – మరువక విడువక నడువగ కృపనిడు ॥ జయప్రభు ॥
5.
ఇహ పరముల నినుగాక ప్రేమతో – నెవరిని గొలిచెదము? – ఎవరిని ప్రేమింప
వశము? – విహరించెదము యేసుని వెంబడి –
మహిమ రాజ్యమున యేసుని గొలువగా ॥ జయప్రభు ॥