#46ఉదయా రాధన
Author: మొలతాతీటి విద్యానందముComposer/Ragam: పీలుCategory: దైవారాధన — దైవస్తుతి
ప
ప్రభువా నిన్నారాధింపను జేరితిమి
ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా
నేడు శుభకాంతి విరజిమ్మగా విభవముగాను
ప్రభాకరముగాను విరియు నీ తేజంబెలరంగా
నభివందనంబులగూడి భక్తిని యాత్మతో సత్యంబుతోడను ॥ప్రభువా॥
1.
ఇరులు గమ్మినదలనుండి యరుణోదయము గనుక
నరిగాపు నీవే కాదా దేవా రాత్రి యరిగాపు నీవేకాదా
విరివిగా మా హృదయ సీమల నెరసియున్న చీకటులు
బోదరిమి శాంతంబైన మనసుల దయను ప్రసాదింపను
భజింతుము ॥ప్రభువా॥
2.
అనఘ నీ సాన్నిధ్యమున నుండగా మా దురసనల
నరి కట్టుమా దేవా మా దురసనల శుచి చేయుము
వినయ భయ భక్తులు దలర్పగా వినుచు నీ వాక్యోపదేశము
లనిశమును ధ్యానింప నాత్మను బంచి తుదకు బ్రసన్నమగుము ॥ప్రభువా॥
3.
పనిపాటలలో మేము దినము నీకే మహిమ
నొనగూర్ప నడిపించుమా దేవా నిన్నే ఘన పరచనడిపించుము
తనువు శ్రమచే బడలినను మా దారి దుర్గమమైన
కనంబడ వనట జెందక నేది జేసిన బ్రభువు గొరకని