FaithWalk
← Back to Library

#45ప్రాతఃకాల ప్రస్తుతి

Author: విలియం డాసన్Composer/Ragam: నాదనామక్రియCategory: దైవారాధన — దైవస్తుతి
ప
వేడెద నాదగు వినతిని గైకొన వే జగదీశ ప్రభో నేడు ప్రతిక్షణ మెడబాయక నా తోడుండవె ప్రభో ॥వేడెద॥
1.
ప్రాతఃస్తవము భవత్సంనిధి సర్వంబున నగు నాదౌ చేతస్సున ధర్మాత్మను సంస్థితి నే బాతకి నజ్ఞానుడను ప్రభువా నీవు కరుణజేయు పాపాచరణము నందు జితము బాపుము నాకు నెపుడు ॥వేడెద॥
2.
పాపముగని భీతుడనై శంకా పరత సతతము నుండన్ నా పై నుంచumu నీదగు సత్కరుణా దృష్టిని బ్రేమన్ ॥వేడెద॥
3.
నాదగు పాప భరం బంతయు నీ మీదనే యిడుచుందున్ నీదు మహాకృప నుండి యొసంగుము నిర్మల గతి నాకున్ ॥వేడెద॥
4.
అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతులు ఒనరింతున్ భవదంఘ్రులపై నాదగు భక్తిని బ్రలింపవే యేసు ॥వేడెద॥