#439పరిశుద్ధత కొరకు ప్రార్థన
Author: ఎస్. బి. సైమన్Composer/Ragam: నాథనామక్రియCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
సంపూర్ణ పరిశుద్ధినిమ్ము – సత్య – సంపూజ్య సర్వజ్ఞ పరిశుద్ధ దేవా ॥ సంపూర్ణ ॥
1.
నిర్మల మనసు రంజిల్ల – నిత్య – పరమానందంబు నా యాత్మలో నెరపు – ధరణి
శ్రమల నోర్పు నిమ్ము – పాప – పరితాప మనుదినం బభివృద్ధి పరచి ॥ సంపూర్ణ ॥
2.
విశ్వాస సమృద్ధి నిమ్ము – నాదు – ఈశుండ శ్రీ యేసు ప్రేమ నెంచి సం –
తోషంబుగా సేవించుటకు – నీదు – నా యాశీస్సు దయచేయు దాస పోషకుడా ॥ సంపూర్ణ ॥
3.
నాలో కృతజ్ఞత నింపు – నన్ను – పాలించు ప్రభునికై – బ్రతుకంగా నిమ్ము –
చాల తనదు మహిమ బొగడి – సర్వ – కాలంబు ధన వాక్కున్ గనిపెట్టునట్లు ॥ సంపూర్ణ ॥
4.
నా పాపములే యేసునాథున్ – ఘోర – తాప నిర్యాణంబు లందింప జేసెన్ –
నా పాపములకు దుఃఖింతున్ – దేవ – కాపాడుమీ నన్ను బాపంబునుండి ॥ సంపూర్ణ ॥
5.
పెక్కంత శుద్ధిని బొంది – నేను – ఇక్కట్ల నోడింప శక్తి నందిమ్ము – చిక్కుల
బడి యుండునప్పుడు – నీతి – లోకమంద నాసక్తి మిక్కుట పరచి ॥ సంపూర్ణ ॥
6.
నీ రాజ్య ప్రవేశమంది – తండ్రి – యా రాజ్య శుశ్రూష నిల నేర్చునట్లు –
పరిశుద్ధాత్మ సహాయ మిమ్ము – యేసు – ధరణి నీవలె నేను వర్తించునట్లు ॥ సంపూర్ణ ॥