#438పవిత్ర హృదయము కొరకు ప్రార్థన
Author: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్Composer/Ragam: శంకరాభరణముCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
విమల హృదయమిమ్ము – విదితంబు నిన్ను గొల్వ – యేసు నాథా –
నీదు విమల రక్తము చేత – విశదము కావలె నెద నిమ్ము – విశ్వనాథా ॥ విమల ॥
1.
అణకువ క్షమ శాంత – మధికముగా నాకిమ్ము – ఆత్మనాథా –
నీకు ప్రణుతమౌ నా యెద – ప్రభుని పీఠము జేయు – మాత్మనాథా ॥ విమల ॥
2.
నీ చిత్తమే యెంచు – నీ పాదముల బట్టి – నిలిచియుందు –
నిండు నికరమౌ ప్రకటితమౌ – సుకర హృదయ మిమ్ము – యేసునాథా ॥ విమల ॥
3.
భయభక్తు లలరెడు – భావంబు నా కిమ్ము జీవనాథా –
నన్ను లయ జీవములయందు – జయశాలినిగా జేయు – మేసునాథా ॥ విమల ॥
4.
పరిశుద్ధ హృదయంబు – పరమేశ నా కిమ్ము – ధరణిమీద –
నన్ని తరుణముల నాకు – ధరణి మావే యంచు – దలప నాథా ॥ విమల ॥
5.
నీ రూపము నిమ్ము – నిన్ను బోలి నేనుండ – నిత్యనాథా –
నీదు సారూప్య మెదమీద – సంపూర్తిగా వ్రాయు – సత్యనాథా ॥ విమల ॥
6.
ప్రేమపూరిత హృదయ – మేమరక నా కిమ్ము – ప్రేమనాథా –
యెంతో ప్రేమమౌ సుమమౌ – నేమమౌ బ్రతుకిమ్ము – క్షేమనాథా ॥ విమల ॥