FaithWalk
← Back to Library

#437పరిశుద్ధత కొరకు ప్రార్థించుట

Author: యేసుదాసు జీవరత్నముComposer/Ragam: రేగుప్తిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
రమ్ము శ్రీ యేసూ – సమ్మతి నాదు – మనమున నిలువ – నిమ్ము నా పెదవుల – నీతి యగ్నిచే నంట – గ్రమ్మర నా నతి – వదలి నీ కృప బొంద ॥ రమ్ము ॥
1.
నిన్ను స్తుతింతు – నీ కృప నెప్పుడు – నెన్ని కీర్తింతును – బనుగ నీ కృపని – నెన్నన్నడెరుగని నరుల – కన్న యేసన్న నీ – ధన్య రుధిరమె చాలు ॥ రమ్ము ॥
2.
తరమే యెన్నంగను – దత్కృపను భూ – నభముల నైనను – నిరతము నీ ప్రేమ – నీతి పరిమితిచే – ధరణి దజో వాసులకును – గలిగించు – గడు వింత ॥ రమ్ము ॥
3.
భవదీయ కృపను – బాగుగ చాటి – భువి నీ చిత్తమును – అధి నెంచక వచ్చి – యమిత బలముతోడ – నవగతి నీతికి – కిరీటంబు నే బొంద ॥ రమ్ము ॥
4.
నేను నీ కొరకై – నిత్యము బ్రతికి – నిన్ను గణించి – మానుగ 'భళా' యను – మంచి వాక్యము విని – దీన ప్రభుని సమాధానములో నే జేర ॥ రమ్ము ॥