#440స్వసమర్పణము
Author: మూంగమూరి దేవదాసుComposer/Ragam: యదుకులకాంభోజిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
తనువు నాదిదిగో గైకొనుమీ ఓ ప్రభువా – నీ పనికి బ్రతిష్టించుమీ –
దినములు క్షణములు – తీసికొని యవి నీదు – వినుతిన్ బ్రవహింప జేయు – నను శక్తి నీయుమీ ॥ తనువు ॥
1.
ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పనిచేయ జేతు వివిగో –
యనయంబు నీ విషయమైన సొగసుగా జురుకు – ధనముతో బరుగెత్త – వినయ పాదములివిగో ॥ తనువు ॥
2.
స్వరంబు నాదిదిగో గైకొనుమీ – వరరాజ నిన్ను గూర్చి – నిరతము పాడునిమ్ము –
మరియు పెదవులివిగో – మహనీయమైన నీ – పరిశుద్ధ వార్తతో – భరిపూర్ణముగా నింపు ॥ తనువు ॥
3.
వెండి బంగార మివిగో – కొంచెమైనను నాకై – యుండవలెనని కోరను –
నిండిన నీ యిష్ట – నియమంబు చొప్పున – మెండుగా వాడుకొన – మితియౌ జ్ఞానం బిదిగో ॥ తనువు ॥
4.
నా యిష్ట మిదిగో యిది – నీ యిష్టముగా జేయ – నా యిష్ట మింక గాదది –
నా యిచ్ఛ యున్నట్టి – నా హృదయ మిదిగో – నీ – కే రాజకీయా సింహాసనమౌ ॥ తనువు ॥
5.
ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధారవోయెదన్ –
నన్ను నీ వానిగా – నాథా గైకొనుమప్పుడు – చెన్నుగా నీ వశమై – స్థిరముగా నుండగదే ॥ తనువు ॥