FaithWalk
← Back to Library

#434క్రీస్తు దాసుల సహవాసము

Author: డేవిడ్ లైటన్Composer/Ragam: బేహాగ్Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసు భక్తావరులతో నివాసముందము – యేసు దాసులౌదము ॥ యేసు ॥
1.
దోసములను దీగ లన్ని కోసివేతము – మిగుల మోసపుచ్చు నాశలన్ని రోసివేతము – యేసు దాసులౌదము ॥ యేసు ॥
2.
దోసిలొగ్గి ప్రభుని వేడ గాసి పడుదము – వాసిగాను యేసుమీద నాసపడుదము – యేసు దాసులౌదము ॥ యేసు ॥
3.
జార చోర దుష్కృత్యములు పారవేతము – సత్య సార మెరుగ పరమ గురుని జేరుకొందము – ఇక కోరుకొందము ॥ యేసు ॥
4.
ప్రాపు లేనివారికెల్ల దా పొసంగును – యేసు శాపరాసులన్ని తానే యోపి మోసెను – తండ్రి దాపొసంగును ॥ యేసు ॥
5.
శరణుజొచ్చు నందరకును దురిత మెంచక – ఘోర మరణ బాధలెల్ల దీర్చి పరమొసంగును – స్థిర వరములిచ్చును ॥ యేసు ॥
6.
లోక భోగముల మదినన్ని రాకింతము – ప్రభు రాక కెదురు చూడ మనమేక మౌదము – ఇప్పుడు ఏకమౌదము ॥ యేసు ॥