FaithWalk
← Back to Library

#433క్రైస్తవానుభవము

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: శంకరాభరణముCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసు నామం బెత్తి పాడుదము – క్రీస్తు దాసులతో బొత్తుగా గూడుదము ॥ యేసు ॥
1.
ఇహ సంబంధుల పొందు జాలింతము – మహా మహుండౌ దేవుని యాజ్ఞ పాలింతము ॥ యేసు ॥
2.
శుభవార్తార్థము లన్ని శోధింతము – యేసు విభు సత్యములలోన నుభవింతము ॥ యేసు ॥
3.
దోషములను బట్టి బెట్టుదము – కపట వేష భాషల ద్రుంగ బెట్టుదము ॥ యేసు ॥
4.
మన రక్షకుని పాటలు మది నెంతము – మనసు లోపలి గర్వము అణపుదము ॥ యేసు ॥
5.
జనుల నిందల కెల్ల నోర్చెదము – బోధ కనిపెట్టి ప్రభు చెంత నేర్చెదము ॥ యేసు ॥
6.
మానావమానముల్ భరియింతము – యోర్వ లేని గుణముల వేరు పరుచుదము ॥ యేసు ॥
7.
పరిశుద్ధాత్మను పొంద నడుగుదము – బుద్ధి పరమానందము జాడ నడుపుదము ॥ యేసు ॥
8.
సకల మానవు లాత్మ సరిచూడుదము – ఇంక మొగ మిచ్చుకపు మాట విడిచెదము ॥ యేసు ॥
9.
దినము ప్రార్థన జేయ గురి యుంతము – చెడ్డ మనసు బద్ధకముపై నెదిరింతము ॥ యేసు ॥
10.
గురు బోధ స్థలికి బిరబిర బోదము – బుద్ధి స్థిరముంచి వాక్యార్థ మెరుగుదము ॥ యేసు ॥