#432యేసూ, మమ్ము నడిపించు
Author: (అనువాదం: జేకబ్ చేంబర్లేన్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: Saviour, like a Shepherd lead usTranslator: జేకబ్ చేంబర్లేన్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసు, మమ్ము నడిపించు నీదు కాపు కావలెన్
నీవు మమ్మును పోషించు మమ్ము జేర్చు మందలోన యేసునాథా, ప్రియనాథా!
మమ్ము విమోచింపవే ॥
1.
మమ్ము నాదరించు యేసు మాకు పాలకుడవు పాప మార్గమునందు నుండి
ప్రేమతోడు తప్పించుమా యేసునాథా, ప్రియనాథా!
మొర నాలకించుమా ॥
2.
బీద పాపులైన మమ్ము నీవు అంగీకరింతువు
మమ్మును బవిత్రపరిచి మమ్ము విడిపించుమా యేసునాథా,
ప్రియనాథా! నిన్ను నాశ్రయింతుము బాల్యమందు నిన్ను జేరి ॥
3.
నిన్ను హత్తుకొందుము ప్రియ రక్షకుండ, యేసూ
నీ ప్రేమ జూపుమా యేసునాథా,
ప్రియనాథా! మమ్మింక ప్రేమించుమా ॥