FaithWalk
← Back to Library

#430యేసూ, జీవమార్గమును చూపింపుము

Author: నికొలాస్ జింజెండోర్ఫ్ (అనువాదం: వి. గియోనింగ్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: Jesus, still lead onTranslator: వి. గియోనింగ్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
జీవమార్గమును యేసూ, చూపింపవే నీవు మాకు ముందు వేగ వెంట వత్తుము మేము వేగ తండ్రి యింటికే మమ్ము నడుపవే ॥
1.
హింస కలిగిన మమ్ము గావుమా మమ్ము కష్టకాలమందు నాదరించు భూమియందు మింటి త్రోవలో మమ్ము నడుపవే ॥
2.
సొంత వేదనన్ చింత కలిగినన్ అన్య హింస గూర్చి యేడువ మమ్ములను సహింపనిమ్ము మేము సత్యమును చూడ నేర్పవే ॥
3.
మా ప్రవర్తన చక్కపరచుమా మాకు నెట్టి హింసలైన నీ సహాయమిచ్చి, నేటి యాత్రకారిగానే తలుపు తీయవే ॥