#429నన్ను నడుపుము యెహోవా
Author: విలియం విలియమ్స్ (అనువాదం: హెచ్. హెన్రీ డేవిస్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: Guide me, O Thou Great JehovahTranslator: హెచ్. హెన్రీ డేవిస్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
నడుపుమీ, మహా యెహోవా లోక యాత్రా యందున నీదు శక్తి నాకు దిక్కు
నన్ రక్షింప జేపట్టు దివ్య మన్నా, దివ్య మన్నా
నా కాపారమై యుండు ॥ నడుపుమీ ॥
1.
ఊటగా స్వచ్ఛ జలము బండనుండి పారనీ
అగ్ని మేఘ స్తంభాలచే నడవి నన్ను దాటించు గొప్ప ప్రాపూ, గొప్ప ప్రాపూ
నాకు తోడవు సదా ॥ నడుపుమీ ॥
2.
యొర్దాను నది దాటు వేళ భీతులెల్ల బాపుము
మరణ శ్రమలన్ని నన్ను క్షేమ కానాను జేర్చును
స్తుతి గీతి, స్తుతి గీతి పాడెదను నిత్యము ॥ నడుపుమీ ॥