FaithWalk
← Back to Library

#43ప్రాతఃకాల స్తుతి

Author: బేతాళ జాన్Composer/Ragam: యమునాకల్యాణిCategory: దైవారాధన — దైవస్తుతి
ప
శ్రీ యేసు కర్తను సేవ జేయుటకు మేల్కొను శ్రీ యేసు కర్తను శ్రేయముల నెరిగి నీకు రేయి పవ లొసంగి యెడబాయని యంతరంగియై పాయంబు ద్రోయ సహాయంబు చేయు ॥శ్రీ యేసు॥
1.
నిదురయందు నేడు క్షేమముగా గాచినాడో సూర్యుడుదయమాయె జూడు నీ హృదయమున సదమల పదములు దరుంప ॥శ్రీ యేసు॥
2.
అంధకార మణిగెన్ హృదయాంధకార మణిగెన్ ప్రభునందు దెలివి గలుగవలెనని బంధనలు డెందమున కందముగ గూర్చి ॥శ్రీ యేసు॥
3.
కంటిపాప వలెను నిన్ను గాయువాని దయను గను గొంటివి స్తోత్రమును జేయు మింటికిని మింటికన్నింటికిని కర్తయని ॥శ్రీ యేసు॥
4.
కలకల ధ్వని జేయు పక్షిగణములు లయను గూయు స్వరములు ప్రభు స్తుతి జేయు నీ వలయక సొలయక వెలయగ బాడ ॥శ్రీ యేసు॥
5.
సేవయందు నీకు మంచి రీవులిడు పరాకు గల భావమున బడి పోకు నేడు కామవే కామవే కామవే యంచు ॥శ్రీ యేసు॥
6.
పగటివారమంచు నిష్టములగు ప్రియలు ద్రుంచు యుగ యుగములు జీవించు పురి కేగెద నీ దిగులు విడువు తగు నమ్మకమున ॥శ్రీ యేసు॥
7.
మింటినంట బాడు నీ యొంటి బలిమి నేడు ప్రభునంటియుండువాడు నీ కొంటి నెన్నంటి కన్నింటికి నీ వాడడు ॥శ్రీ యేసు॥