FaithWalk
← Back to Library

#42ప్రాతఃస్తవము

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: కాంభోజిCategory: దైవారాధన — దైవస్తుతి
ప
తెల్లవారిన వేళ దెలివొంది మన క్రీస్తు దివ్య నామము బాడరే ఓ ప్రియులారా దివస రక్షణ వేడరే తల్లి రొమ్మున దాచు పిల్ల రీతిని మనలన్ జలదనంబుగా రాత్రి రెల్ల గాచిన విభుని ॥తెల్లవారిన॥
1.
నిద్రపోయిన వేళ నిఖిలాపదలు బాపి నిశలన్ని గడుపు విభునికన్ భద్రముగా వినుతించి భయభక్తులతో మనము ముద్రితాక్షుల గేలు మోడ్చి మ్రొక్కుచును ॥తెల్లవారిన॥
2.
భానుడుదయమ బయ్యె బద్మములు వికసిల్లె గానములు జేసె బక్షులు మానసాబ్జము లలర మనము కలసిరి మెట్ట పై నెక్కు నిన్నుడనెడి ప్రభుని జూచి వేడకన్ ॥తెల్లవారిన॥
3.
బిటవముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొనియుండు దినమునన్ దట్టముగా మన నాలుక తట్ట యేసుని కరుణ జుట్టుకొని రక్షించు శుభమడుగుకొనుచును ॥తెల్లవారిన॥
4.
పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నొరిగి కాపు కర్త విశాల కరము మాటున దాగి యాపదలు దొలగించు మని వేడుకొనుచును ॥తెల్లవారిన॥