#44ఉదయా రాధన
Author: విలియం డాసన్Composer/Ragam: బిలహరిCategory: దైవారాధన — దైవస్తుతి
ప
సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ తాప
హర్తా యకలంక గుణమణి నికర పేటికా
ప్రకట లోకచయ పరమ దయాలయ ॥సకల॥
1.
నాదు నెమ్మది తొలగించుచు ప్రతివాద
లీమెరయి నెంతో పాదుకొన్నారు బాధలందైనను
సాధులను బ్రోవ నాదియైనట్టి నీ వాధారమై యుండు ॥సకల॥
2.
దినకృత్యముల కష్టమంత చీకటిననే నీ
కడ భక్తి మనవిచేయ వినుచు నా కష్టము
వెస నష్టముగ జేయ ఘనముగా నాయందు
గరుణ జేసితివి ॥సకల॥
3.
తమ కాపు నన్ను కాపాడుగా నేను
త్వము నిద్ర బొందితిని దనివి దీర కొమరొప్ప
మేల్కొనగా గూలిన మృత్యు భయము బొంద
నా డెందమందు నెల్లప్పుడు ॥సకల॥
4.
రాత్రి సుఖనిద్ర జెంద జేసి రక్షింప నన్ను
నీకే చెల్లు ప్రాతఃస్తుతులు చేయ పగలు
ఎచ్చు తెలివి ఖ్యాతముగా నాకు గలుగజేసితివి ॥సకల॥