FaithWalk
← Back to Library

#426లోయలోపల

Author: విలియం ఆర్. కట్ కషింగ్ (అనువాదం: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: Down in the valleyTranslator: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
నా రక్షకుని వెంబడింతు నన్నిటను ప్రయాసమైన లోయలైన భయ ఘోరమైన కొండలైన జంకక నడచెదను సురక్షితంబుగాను నేను వెళ్లుదును దయ జూపు యేసు నన్ను వెంబడించి పరమ కిరీటమొందువరకు నడిపించుచో ॥ యేసు ॥
1.
నేను ఎన్నడెన్నడును భయపడను మేలు భువనంబులో దగన్ ఆశతో నన్నిటను వెంబడింతును. నా యేసుతోడ వెళ్లుచుందు నా కర్తతోడ నెందునైన నేగుదెంచెదను నెల్లడను నాకు మెచ్చిన తండ్రి చూచువరకున్ ॥ యేసు ॥
2.
నా కాలమెల్ల యేసునందు నమ్మి భాసురంబు ప్రభు వెంట కన్నులుందును – మూసికొని యెక్కడైన వెళ్లుదును – భీకరంపు వారిధులైన నేను దాటుదును ॥ యేసు ॥