#427ప్రతి గంట నాకు నీవు కావాలి
Author: యానీ షేర్వుడ్ హాక్స్ (అనువాదం: బక్నార్ లూథరాఫ్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: I need Thee every hourTranslator: బక్నార్ లూథరాఫ్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసూ, నా ప్రభువా, నీ ప్రేమ లేకున్న
నా యాత్మ కేదియు విశ్రాంతి నీయదు ॥
1.
ఒక్కొక్క గంట నేను నిన్నాశ్రయించుకొందు నీ యాశీర్వాద మిమ్ము
నా రక్షకుడా ॥
2.
యేసూ, రేయింబగళ్లు నా యొద్ద నుండుము
నాతో నీవుండిన నే భయముండదు ॥
3.
సుఖంబు బొందగా నిన్నే యాశింతును దుఃఖంబు
నొందగా నీవే శరణ్యము ॥
4.
నీ మార్గమందున నే నడువ నేర్పుము
నీ మాట చొప్పున నన్నును దీవించుము ॥
5.
నిన్నే యాశింతును యేసూ, నా ప్రభువా నీవంటివాడనై
నన్నుండ జేయుము ॥