#423యేసు సర్వశక్తుడు
Author: చదలవాడ జోనాComposer/Ragam: జంఝూటిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
సర్వశక్తుడా నిర్మలాత్ముడా –
సర్వజన సంరక్షకా – మా సర్వపాపము బరిహరింప నీ – సర్వమహిమను విడిచివా ॥ సర్వ ॥
1.
నిత్య నాశనమగునట్టి మమ్ము – నిత్య శాపము బాపి మరి – నీ నిత్య జీవము మాకు నియ్యను – మృత్యు బాధలు పడితివా ॥ సర్వ ॥
2.
పాప మరణపు బంధకములను – తెంపి మమ్ము
విడిపించుటకు – మా పాపమును భరించి మాకై – యాపదల పాలైతివా ॥ సర్వ ॥
3.
మెట్టుకు బౌలు దుష్టులనుచే – పట్టి జీవము నిచ్చితివి – కాబట్టి యిక నీ కట్టడల
లో – దిట్టముగా బలపరుచుమా ॥ సర్వ ॥
4.
సత్యవిధుల లో నడువ నేను – శక్తుడను రక్షకా – నీ భృత్యునికి శక్తి నిచ్చి నడి – పింపు నీ ఘన సేవలో ॥ సర్వ ॥
5.
నీదు నామము మహిమపరచుచు – నాదు జీవితకాలమున – బహు
సాధువుగా నన్ను జేసి సాయము – నాథుడా నాకీయుమా ॥ సర్వ ॥
6.
ప్రస్తుతము పరదేశినై – ప్రచురంబు జేతు నీ స్తోత్రములు – పరమ వస్తు
ఘన రాజ్యంబు కొరకై – వాస్తవముగా నిరీక్షింతున్ ॥ సర్వ ॥
7.
ముక్తినుండి నీవు రాగా – శక్తితోడ ప్రభు యేసువా – యా శక్తితో నిన్ను
గూడుకొని బహు – యుక్త స్తోత్రములు జేతుము ॥ సర్వ ॥