FaithWalk
← Back to Library

#424యేసు మన యాశ్రయము

Author: మిక్కిలి శామ్యూలుComposer/Ragam: సావేరిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
శరణు శరణు యేసు దేవా – నన్ను గరుణింపవే నిత్య జీవా – పరమ దేవుని తనూ – భవుడవై ధరణిలో – నర రూపమైతివి – నరులను రక్షింప ॥ శరణు ॥
1.
దైవోగ్రమునకు పాత్రుడను – విమల – భావమునకు నసహ్యుడను – గావించిన పాప కర్ముడను హీనుడను – జానవలసినట్టి స్వామి ద్రోహుడనయ్య ॥ శరణు ॥
2.
మద మత్సరంబులు మెండై – నాదు – మది నాక్రమించెను నిండై – సదయుండ నీ దివ్య – సర్వజనుల మూరి – విదితముగా బాపములు – వేడుకొన జేసితి ॥ శరణు ॥
3.
మోసంబులో జిక్కి చాల – నేను – దోసంబు చేసితి నిల – యేసు నాథుని సిలువ నే మాత్రమైనట్టి – నా సతితో గూడని – యన్యాయపరుడను ॥ శరణు ॥
4.
నెమ్మది యింతయు లేక మదిలో – లేక – గ్రమ్ముకొని యాఘనము నా యెదలో – ద్రిమ్మరినై భువిని – తిరిగి వేసారగా సమ్మతము దొరకదో – సర్వేశ్వరుడా నీకంటె ॥ శరణు ॥
5.
నా తండ్రి యో యేసునాథ – నిన్ను – భూత చేసిన దేను గాదా – నీతిమాలిన పాప – నీచుడను దుష్టుడను – నా తప్పు క్షమియించి నన్నేలి రక్షింపు ॥ శరణు ॥
6.
కడు దయా శాంత స్వభావా – నన్ను – దడవు చేయక యేలుకోవా – యెడబాసియున్న జనులకై – యోర్చి యా యాసటను – బడి జీవమిచ్చిన నా – ప్రాణ రక్షక కావు ॥ శరణు ॥