FaithWalk
← Back to Library

#422మంచి కాపరి

Author: మల్లెల సొలొమోను జార్జిComposer/Ragam: కమాసుCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యెహోవా నా కాపరి – ఇక నాకు కొదువ ఏమి ॥ యెహోవా ॥
1.
పచ్చిక చోట్లలో – పండుకొన జేయును నన్ను – స్వ చ్ఛ జలముల కడకు – చక్కగా నడిపించు ॥ యెహోవా ॥
2.
ఆయన దయతో నా – యాయాసముల దీర్చి – న్యాయ మార్గములందు – నన్ను బట్టి నడిపించు ॥ యెహోవా ॥
3.
గాఢాంధకార మార్గమున – నేను దిరిగినను – గాఢంపు గుహతోడ – కరుణించు నన్నెప్పుడు ॥ యెహోవా ॥
4.
నీవు తోడైయుండ – నిర్భయంబగు నాకు – కావవచ్చును దుడ్డు – కర్రయును దండంబు ॥ యెహోవా ॥
5.
నా శత్రువుల నడుమ – నాకు భోజ నమొసగి యాశ తీరగా – తలంటె నూనెతో బోసి ॥ యెహోవా ॥
6.
నా గిన్నె నిండెను – నా బ్రతుకు దినములలో బాగుగా నీదు కృపా – పాద దయలు వెంటాడు ॥ యెహోవా ॥
7.
పరమానందముతోడ – ప్రభు సన్నిధానమున – పరిశుద్ధాలయమందే నిరతంబు నివసింతు ॥ యెహోవా ॥