#421యేసు శరణుజొచ్చుట
Author: మిక్కిలి శామ్యూలుComposer/Ragam: కేదారగౌళCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
శరణు జొచ్చితి యేసునాథుడా –
శక్తిహీనత గలిగె నా – ధరణి మిమ్ము నెమ్మి బొందితి – దయచేసి కావవే ॥ శరణు ॥
1.
కరుణ జూడుము కన్న తండ్రివి – కల్మషం బడబాపవే – మరణమొందక మునుపు నన్నిల – మార్పు నొందగా జేయవే ॥ శరణు ॥
2.
మొరను జేర్చెద నాలకించుచు – మోము నా దెస జూపవే – యు
రు పదంబుల సేవ జేసెద – నుద్ధరించుము కూర్మితో ॥ శరణు ॥
3.
తామస క్రియలందు వాంఛలు – తాకకుండగా జేయవే – క్షేమమైన
సువార్త బోధల – సిద్ధపడి విననీయవే ॥ శరణు ॥
4.
శ్రమలు చాల గలిగి యున్నను – సైప నేర్పుము సత్కృపన్ – గమిలి పోయెడి
మాయ లోకపు – కాంతి నీరస మంచును ॥ శరణు ॥