FaithWalk
← Back to Library

#420క్రీస్తు కరుణయాశ్రయించుట

Author: మిక్కిలి శామ్యూలుComposer/Ragam: ముఖారిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసు కరుణ – ఇదియే మా శరణు – యేసు కరుణ ॥ యేసుని కరుణ – ఇదే మాకు శరణని – యాసతో నమ్మిన – యధములకు నెల్ల ॥ యేసు ॥
1.
ఎన్నిక చేయక – యే పాపినైనను – మన్నించి బ్రోచెడు – మా దేవుడైన ॥ యేసు ॥
2.
పశ్చాత్తాపము నొందు – పాపుల నెల్లను – నిశ్చయముగా బ్రోవ నిపుణులై యున్న ॥ యేసు ॥
3.
దిక్కు లేకున్నట్టి – దీన జనాత్మల – చక్కగా బ్రోచెడు – సదయుడై యున్న ॥ యేసు ॥