FaithWalk
← Back to Library

#418ముక్తి గనుట

Author: గ్రక్కునను జేసుట్టిడిప్పుడే ॥ ముక్తి ॥Composer/Ragam: భూపాళముCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ముక్తి గనరే ముక్తి – గనరే మీ మనంబుల – శక్తిగల రక్షకుని పలుకులు – ముక్తి సాధన ములకు మూలము – భక్తి గొని యానంద మొందరే ॥ ముక్తి ॥
1.
పాపభారము క్రింద శ్రమపడు – పాపులారా రండు నేనే – ప్రాపు నెమ్మది మీకు నిచ్చెదనని – பரమ రక్షకుండానతిచ్చెను ॥ ముక్తి ॥
2.
ఇచ్చ యించువాడు ఇచ్చటికి – వచ్చి జీవజలంబు రుచిగా – పుచ్చు కొనుగా కనుచు బలికెను – సచ్చరితుడు మనుష్య పుత్రుడు ॥ ముక్తి ॥
3.
ఆకాశమునందుండి యిటు దిగి – లోకమునకు జీవము నొసగునది – ఈ కడనై యున్నదది నేనే యని – యేసు ప్రభు వాక్యము మధురాన్నము ॥ ముక్తి ॥
4.
నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవము నావలననే – గాని యె వ్వడును తండ్రి యొద్దిక – రానలవిగాదని వచించెను ॥ ముక్తి ॥
5.
జీవజలమును ద్రావుటకు మీ – భావన లనెడి పాత్ర ముంచుచు – చేవ గొని పానించుచు నిరత – జీవమును వెలుగొంది బ్రతుకుడి ॥ ముక్తి ॥
6.
ఎక్కడను ఇటువంటి ప్రభువును – మక్కువను వేసారి వెదకిన – చిక్కబోడటు వచ్చి చూడుడి