#417యేసు మన ఆశ్రయ రక్షకుడు
Author: తటవర్తి నారాయణస్వామిComposer/Ragam: ముఖారిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
నాకై చీల్చబడిన యుగయుగముల శిల ముక్తి – నా కిమ్ము శ్రీ యేసువా
లోక రక్షక నన్ను నీ లోపల దాచి – వీక్షతోడను నుండనిమ్ము సద్గుణ శీలా ॥ నాకై ॥
1.
చీలబడిన నీదు ప్రక్క విడిచి పారు – జాలు జలము రక్తము – చాల నా పాపపు తీర్పు పాప బలము – చాలు రూపమును మాపి నన్ను
బావను జేయు ॥ నాకై ॥
2.
నీదు న్యాయంబగు ప్రామాణ్య విధులను – నాదు సత్కృతి తృప్తిగా – నాదరింపవు పారమార్థికమైనట్టి – నాదు నాసక్తి భాష్పమును బారిన నాకు ॥ నాకై ॥
3.
నేను చేసిన పాపముల ద్రుంప నెవరిని – గాన నేరను యేసువా – దీనుడనై వచ్చి నీ మేటి సిలువను –
మానక నే హత్తుకొనియెద సచ్చరిత ॥ నాకై ॥
4.
కట్ట బుట్టము లేక పుట్టమునకై యాశ – బుట్టి నీ యెడ వచ్చితి – నెట్టి సహాయము లేక నీపై మది – బుట్టి నీ సత్కృ
తిని బొంద నెంచెదనయ్య ॥ నాకై ॥
5.
పరమ కల్మషుడునైన నేను నీటి బుగ్గకు – బరుగు లెత్తెద నిప్పుడు – పరమ పావన నన్ను గడుగుము లేకున్న – మరణ
మొందుదును నేను ఘోర పాప విధూర ॥ నాకై ॥