#419యేసు నా ఆత్మ ప్రియుడు
Author: మాథ్యూస్ శామ్యూలుComposer/Ragam: ఆనందభైరవిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసూ నా యాత్మ రక్షకుండ – నన్ను – వాసిగా నీ రొమ్మున నుండనీ –
చేసియు జలరాసులను నీవు – తీసివేయము – మోసముల ద్రోసి ॥ యేసూ ॥
1.
జీవ బాధల దాటుదాక – నన్ను – నీవె దాచము నా రక్షక – రూపమునకు
నడప – ప్రోవుము యేసు – దేవయాత్మను – జీవమును జేర్చు ॥ యేసూ ॥
2.
ప్రాపు లేని నా యాత్మకు నీవు – నీదు – దాపునకు జేర్చి బ్రోచి కావుము పర
మాత్ముడా – యుపేక్షతో నెంచి – యాపదలు బాపి – యాదరించుము ॥ యేసూ ॥
3.
నా నమ్మకము నీ యందున్నది – నీలో – నేను కోరు సాయంబున్నది – గాన నే
ప్రాపు – లేని నా తలను – బూని రెక్కల – లోన గప్పుము ॥ యేసూ ॥
4.
యేసు నీవె నాకు సర్వము – నీదు – దాస జనుల లేవనెత్తువు – నీ
సుబల మిమ్ము – యేసు రోగులకు – వాసిగా జీకువారలను నడప ॥ యేసూ ॥
5.
నావంటి ఘోర పాపి యేడి – యేసు – నీవంటి పరిశుద్ధుండేడి – కేవలము స
త్య – భావముతో నిండి – నీవు కృపగల – దేవుడవు స్వామి ॥ యేసూ ॥
6.
నీదు కృపా బాహుళ్యమందు – యేసు నాదు పాపము గప్పుకొందు – సాదరంబగు – నీదు మాటల – మోదమున శుద్ధి – పాదుకొననిమ్ము ॥ యేసూ ॥
7.
నీవు నిత్య జీవపుటూటవు – నాకు – జీవజలంబు నిచ్చి కావుము – మీపు నా యెదలో గావుగా లేచి – జీవ పదవికి ద్రోవ తీయుమా ॥ యేసూ ॥