#414యేసుని ప్రేమ
Author: పులిపాక జగన్నాథముComposer/Ragam: ముఖారిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
నీవే నా ప్రియుడవు – యేసు ప్రభు – నీве నా యొడయుడవు
నీవే యనాది – దేవ పుత్రుండవు –
నీవే లోక మెల్ల – నేర్పుగన్ జేసితివి ||నీవే||
1.
పరమందు నీకుండు – పరమభాగ్యంబులు –
నరకాయత్తుడ నైన – నా కొరకు విడిచితివి ||నీవే||
2.
నీవే నను బ్రోవ – నెనరు నేతెంచి –
నీ నెత్తురు ఒలకబోసితివి – నీ నల్ల సిలువపై ||నీве||
3.
నేనెవరిని బ్రేమింతు – నీ కంటె లోకమున –
నే నెప్పుడు మరువను – నీ ప్రేమ నాకర్త ||నీве||
4.
నీ సేవ నే గోరి – నిన్నే ప్రస్తుతింతు –
నీ సేవకుడ నైన – నే నెట్లు నిను విడుతు ||నీве||
5.
సకలంబు నేలెడి – చక్కని రాజువు –
సకలాధికారంబు – చక్కగ జేయుదువు ||నీве||
6.
నీ సేవకుల నెల్ల – నేర్పుగా నేలెదవు –
నీ సేవకులు పొంద – నిత్య సహాయంబు ||నీве||