FaithWalk
← Back to Library

#413యేసు తోడైయుండిన జాలును

Author: పులిపాక జగన్నాథముComposer/Ragam: బిలహరిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
నీవు తోడై యుండినజాలు – యేసు – నిత్యము నాకుది మేలు నీవు ధరణి నిండు – నీచపాపుల నెల్ల గావన్ బ్రేమ వచ్చి – ఘన ప్రాణ మిచ్చినట్టి ||నీవు||
1.
నిన్ను బోలు రక్షకుం డేడి – క్రీస్తు – నను బోలు పాతకుం డేడి నిను నమ్ము వారలకు – నీ వొసగుచుందువు – తనర పాపక్షమ – దయచేత నిలలోన ||నీవు||
2.
నీ పాటి బలవంతుం డేడి – ప్రభు – నాపాటి దుర్బలుం డేడి కాపాడుచుందువు – కలకాలమును నీవు – నీ పాడ సేవకుల – నేర్పరంజిల్ల ||నీవు||
3.
నీవంటి ఉపకారి యేడి – కర్త – నావంటి కడు దీనుం డేడి జీవులకును గల్గు – జీవంబు లిచ్చుచు – జీవాధారము లొసగి – జీవులన్ బ్రోచెడి ||నీవు||
4.
నీవంటి धनవంతుం డేడి – యేసు – నా వంటి ధనహీనుం డేడి ప్రోవులై యున్నవి – ఈవులు నీయందు – నీవు వాని నొసగి నిరతంబు నను గావు ||నీవు||