#412దైవ సహాయము
Author: మల్లెల దావీదుComposer/Ragam: మధ్యమావతిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
కొండల తట్టు నేను – కోర్కెతోడ నాదు
కన్ను లెత్తెద నిప్పుడు – దండియౌ సహాయ మెచ్చటి నుండి
నాకు వచ్చునో – అండయౌ ప్రభునిచే స – హాయంబు కలుగును ||కొండల||
1.
ఆయన భూమ్యాకాశము – లన్నిటిను సృజించె గదా –
ఆయన యిక దొట్రిల్ల – నీయడు నీ పాదమున్ ||కొండల||
2.
నిన్ను గాపాడువా – డెన్నడును కునుకడు –
పన్నుగ నిశ్రాయేలు గా – పాడువాడు కునుకడు ||కొండల||
3.
నీకు యెహోవాయే – నిజముగా గాపగు –
నీ కుడిప్రక్కను ప్రభుండు – నీకు నీడగా నగున్ ||కొండల||
4.
ధాత్రి పగలెండు దెబ్బ – రాత్రి వెన్నెల దెబ్బయైన –
మాత్రమైనను నిన్ను – మార్కొనంగ జాలవు ||కొండల||
5.
ఏ అపాయమును రా – నీయకుండ నా యెహోవ –
పాయక నిను గాచును నీ – ప్రాణమున్ గాపాడును ||కొండల||
6.
మోదంబుతో నిది – మొదలుకొని నిత్యమునన్ –
నీదు రాక పోకలందు – నిను యెహోవా కాచును ||కొండల||
7.
జనక కుమారాత్మకును – ఘనత మహిమ కలుగును –
మును నిప్పుడు నెల్లప్పుడు యుగ – ముల కగును గాకామేన్ ||కొండల||