FaithWalk
← Back to Library

#411దైవ సహాయము – నడిపించుము

Author: సమూయేలుComposer/Ragam: యదుకులకాంభోజిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ఓ దేవా నేను నీ – దాపున నుండగదె నీ దాపున నుండగదె – నా దేవా నను లేపుము నను సిల్వ శ్రమలైననె – నీ దాపున నుందు నీ సేవకునికి పాట ||ఓ దేవా||
1.
దైవసన్నిధి
2.
బాటసారి లాగు – నేడు భానుడు గ్రుంకి – మేటి చీకటి గ్రమ్మిననె – నాటికి విశ్రాంతికి – జోటు బండయైననె – మాటిమాటికి గలలో – సూటిగా నిను తలతు ||ఓ దేవా||
3.
ఆకాశ మండల – మార్గంబు నడిపెడు – నా కరము చూపించుమా – నీ కూర్మిచే నాకు – చేకూరు నంతయు – లోకేశ్వరా దూత – లేక కోరి నను బిలువ ||ఓ దేవా||
4.
నీకు స్తోత్రము చేసి యపుడు నా మదిలోని – ప్రాకటంబగు నెనరుతో – భీకరము లైన – శోకంబులను రాళ్లను – నీకు నాలయంబు – నే గట్టెదను గర్తా ||ఓ దేవా||
5.
సంతసంపు రెక్క – లెత్తి నాకము నందు – నెంత పైకి లేచిననె – వింతగ జ్యోతుల – వితతి మించి నేన – త్యంత మెగసినను నీ – చెంతకే గును బాట ||ఓ దేవా||