#415దేవుని నాశ్రయించుట
Author: ఎస్. ఎస్. శేషతుComposer/Ragam: కాపిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ఓ దేవా నన్ను బ్రోవ – నీదే భారమయ్య రావే ॥ ఓ దేవా ॥
1.
స్వామి స్వామి యన నా భారం – ప్రేమ చూపను నీ భారం
పామరుడ ననెడు నా భారం – పాపిం బ్రోవను నీ భారం ॥ ఓ దేవా ॥
2.
నెనరు తండ్రి యన నా భారం – నన్ను గనులు చూడ నీ భారం
నిన్నే నమ్మ నాదు భారం – నన్నెప్పుడు కావ నీ భారం ॥ ఓ దేవా ॥
3.
కరుణ సాగర యన నా భారం – కరుణ చూపను నీ భారం
శరణని వేడ నా భారం – సంతరింప నీ భారం ॥ ఓ దేవా ॥
4.
మనవి చేయు నాది భారం – తనివి దీర్పను నీ భారం
నిన్ను మది దలప నా భారం – నన్ను గావ నీ భారం ॥ ఓ దేవా ॥