#40Holy, Holy, Holy, Lord God Almighty
Author: రెజినాల్డ్ హెబర్ (అను: జేకబ్ చేంబర్లేన్)Category: దైవారాధన — దైవస్తుతి
1.
శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు
ప్రాతఃకాలస్తుతి నీకే చెల్లింతుము
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా!
ముగ్గురైయుండు దైవత్రేకుడా!
2.
శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందున్న
పరవాసులు ఎల్ల నిన్నే శ్లాఘింతురు
సెరపుల్ కెరూబులు సాష్టాంగపడి
నిత్యుడవైన నిన్ నుతింతురు.
3.
శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ
పాపి కన్ను చూడలేని మేఘ సృష్టి
జాలమంత నీ కీర్తి బాడును
అద్వితీయప్రభు, నీవు మాత్రవే.
4.
శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు
వాసివి శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా
ముగ్గురైయుండు దైవత్రేకుడా!
కరుణ, శక్తి, ప్రేమరూపివి.