FaithWalk
← Back to Library

#39O For a Thousand Tongues to Sing

Author: చార్లెస్ వెస్లీCategory: దైవారాధన — దైవస్తుతి
1.
నృపా! విమోచకా! ప్రభా వేలాది నోళ్ల నీ కృపా జయ ప్రభావములు నుతింతు నెంతయునన్.
2.
కృపాధికార! దేవా! నీ సాయంబు చేయుమా భవత్ప్రభావ కీర్తనలన్ చాటంగ నెల్లడలన్.
3.
భయంబు చింత బాపును హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును.
4.
విముక్తి చేయు మిద్దాని పాపంబు బాపును పాపాత్ము శుద్ధు జేయును శ్రీ యేసు రక్తము.
5.
జనాలీ! పాపులల్లరు! శ్రీ యేసుని నమ్మండి కృపావిముక్తులందుండి సంపూర్ణ భక్తితో.
6.
అర్పించె యేసు ప్రాణమున్ నరాలి గావను యజ్ఞంపు దేవు గొర్రెపై నఘంబు వేయండి.
7.
సత్కీర్తి స్తోత్ర ప్రేమలను భాన భూమిని సర్వత్ర దేవుడొందుగా సద్భక్త పాలించే.