#390విశ్వాసమువలని విశ్రాంతి
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: మారువ (చేయ: మంగళంబని పాడరే)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
సందియము వీడవే – నా మనసా యా – నందమున గూడవే
సందియము లింకేల నిను సుఖ – మొంద జేసెడు క్రీస్తు రక్తపు
బిందువులు శుభవార్త వాక్యము – లందు గని తెలివొంది బ్రతుకుచు || సందియము ||
1.
చింతలింక మానము – లోకులు దెల్ప – భ్రాంతులు పడి బోకుము
ఎంత వింత దురంత పాపము – లంతటను దన రక్తమున గో – రంత
లేక యెదురుచునని సి – ద్ధాంతమగు ప్రభు వాక్యమును విని || సందియము ||
2.
పాపములు వీడుము – నీ వినయ పశ్చా – తాపమున గూడుము
ఏపు మీరిన యోర్పుతో నొక – పాపి కైన లయంబు గోరక – పాపులందరు తిరిగి వచ్చెడు – కోపుగోరెడు కర్త దరి జని || సందియము ||
3.
నేరముల నెంచకో – యేసుని కరుణా – సారమున్ దలంచకో
భారముల్ మోయుచు శ్రమన్ పడు – వారలందరు నమ్మి నా దరి జేర విశ్రమ మిత్తునను
ప్రభు – సార వాక్యెలు చక్కగా విని || సందియము ||
4.
నిమ్మళము నొందుము – రక్షకుని పలుకు – నమ్ముకొని యుండుము
ఇమ్మహిని బాపులకు నైప – క్షము చేసి పరాత్పరుని సము – ఖమ్మునందు చిత్తముగా – కాయమ్ము బలియుడు నీ ప్రభుని గని || సందియము ||
5.
ప్రేమ దయా శాంతముల్ – కర్తకు భాషా – స్తోమములు అవంతముల్
నీ మొరలివి యేసు నాధ – స్వామి తన రక్తమున బాపము దొమి నమ్మకలంకుగ – జేయును నీ మదిన దగ నమ్ముకొన రింక || సందియము ||