FaithWalk
← Back to Library

#391విశ్వాస విజయము

Author: మురారి దావీదుComposer/Ragam: కమాను (చేయ: కొనియాడదరమే)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
విశ్వాసమే విజయము – విను ప్రియుడా యా – విశ్వాస మపజయము విశ్వాసాయుధమైన – విసుకని సుకార్యములే – విశ్వాసవంతునికి – విజయమొసంగును నిజము || విశ్వాసమే ||
1.
భక్తుడం దువలననే – బ్రతుకును మరియు – శక్తినొంది నిల్చును యుక్తముగా వర్తించి – యుక్తిని జయించి – ముక్తినొందునటంచు – రక్తిగా పాడుదను || విశ్వాసమే ||
2.
మంచి పేరు నొందును – సాతాను నెది – రించి విజయమొందును మించిన బాధల్స – హించి జయించును – నంచిత మరణము – నానందముగ గాంచు || విశ్వాసమే ||
3.
ప్రవిమలమొందెదము – పాపమునుండి – పరిహరింపబడుదము అవిరతమును మనము – నాశ్చర్యముగ ఘనము – భువి యందునన్ దివి యందునన్ – బుధులతో నొందెదము || విశ్వాసమే ||
4.
నీతిమంతుల మౌదము – నిశ్చయము ప్ర – ఖ్యాతి బోధను నేర్తుము ఆ తండ్రి దత్తముల – నన్ని యాజించుచు – యాతని సుభద్రములో – ననయముందుము నిజము || విశ్వాసమే ||
5.
పరిపూర్ణ విశ్వాసమే – క్రియలతో నున్న – మరి మంచి విశ్వాసమే ధరయందునన్ బరమందునన్ – ధన్యాత్మునిగ జేయున్ – సరగను నద్దానినే – సంపాదింపుము ప్రియుడా || విశ్వాసమే ||