FaithWalk
← Back to Library

#389విశ్వాస ఫలితములు

Author: మురారి దావీదుComposer/Ragam: జంఝూటిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
విశ్వాస ఫలితములు – విశదముగా నీకు వివరింతు విను క్రైస్తవా – విశ్వాసవంతునికి – విశ్వము లోపల మా – వశ్యము త్తమ్మెదవు క్రైస్తవా || విశ్వా ||
1.
ఫలితములన్నింటిలోన – ప్రాముఖ్యమైనట్టి – ఫలితమది పాప క్షమమే విలువైన యీ ఫలితము – గలుగు నరునికి ముక్తి – దొలగ దతనికి క్షేమమే || విశ్వా ||
2.
దానములలోను ప్రధానమనబడు సమా – ధానమును గలిగించును మానితముగా సమా – ధానమును భువి దివుల – మహితునితో గలిగించును || విశ్వా ||
3.
నరక పాత్రులమైన – నావంటి నీవంటి – దురిత జీవుల నెల్లను గొరతలన్నియు దీర్చి – నిరత జీవము నియ్య – నిశ్చయ మిమ్మది చెల్లును || విశ్వా ||
4.
ముత్యమునకు వలెనె – మురికి గప్పినట్టి – చిత్తమును చిత్రవిధిగా రత్నమువలె మిగుల – రంజిల్ల జేసెడి ప – విత్రాత్మ మనకొదవగా || విశ్వా ||
5.
మేరలేని దోష – కారులమై ప్రభుకు – దూరముగ దొలగియున్న వారముగు నన్ను నిన్ను – చేరంగ బిలిచి కు – మారత్వ మొసంగు నన్న || విశ్వా ||
6.
చేగు క్రియలను జేసి – పోగొట్టుకొనినట్టి – క్షేమ రాజ్యపు హక్కులన్ బాగుగ మనకిచ్చి – బాంధవ్య మొనరించు – భగవంతునికి మనకున్ || విశ్వా ||
7.
విశ్వనాధుని గొప్ప – విశ్రాంతిలోను ప్ర – వేశము నాకు నొసంగుగా విశ్వాస ఫలితము లీవి – నీ శాశ్వత రక్ష – ణాశ్రయం బదియు విడువకు || విశ్వా ||