#388విశ్వాస ప్రార్థన
Author: ఎ. జెకర్యాComposer/Ragam: సౌరాష్ట్ర (చేయ: మనసానందము)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
విశ్వాసముతో – వేడెడి వారికి – విశ్వమంతయును – వీల్పడును
శాశ్వత రాజ్య – దీశ్వర మేధావీశ్వరుండు – શાశ్వతమగు నీ – శాసన మిచ్చెను || విశ్వా ||
1.
బిడ్డలు తండ్రుల – వేడగ నన్నము – బెడ్డలు ఇచ్చు వె – రులు గలరే
దొడ్డ తండ్రి నిలన్ – దొడ్డార అడిగిన – నుల్లము లేక విమ – లాత్మ నొసంగును || విశ్వా ||
2.
నమ్మకమునన్ – వడెడు నరులను గానము – నమ్మక చెడుదురు – నరులయ్యో
ఇమ్మహి సకల శు – భమ్ములు గలుగును – సమ్మతి వెదకగ – శాశ్వత రాజ్యము || విశ్వా ||
3.
వెతకెడు వారికి – వెసన కృప జూపును – గతి గని వేడం – గా దెరచున్
సతతము యేసుని – చక్కని పేరట – హిత మతి వేడగ – నెంతయు మేలగు || విశ్వా ||
4.
బలమేమియున్ – గనన్ – బడు దాహనే సలిపెడు భక్తుని – సతిమనుచు
నలయకు నేలను – నావగింజ మరి నిలిపిన జెట్టెరు – నింగిక నెదిగెద || విశ్వా ||
5.
అవిశ్వాసమున – నతి భీతులచే – నవిసి క్రుంగ నగు – నే మనసా
భువిని బాపాత్ముల – బ్రోచెడు ప్రభు కృప – జవి జూడుము నుతి – సల్పుచు వేగమే || విశ్వా ||