FaithWalk
← Back to Library

#384Sweet Hour of Prayer

Author: విలియం వాల్‌ఫోర్డ్Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
1.
ఓ ప్రార్థనా సుప్రార్థనా నీ ప్రాభవంబునన్ మరతునా? నా ప్రభువునన్ ముఖా ముఖిన్ నే ప్రణుతింతు నీ ప్రభన్ నా ప్రాణమా సుప్రార్థనా నీ ప్రేరణంబుచే గదా నీ ప్రేమధారన్ గ్రోలుదు నా ప్రార్థనా సుప్రార్థనా.
2.
పిశాచి నన్ను యుక్తితో వశంబు చేయ నెంచుచో నీ శాంతమైన దీప్తియే నా శంక లెల్ల మానుపున్ నీ శక్తి నేను మరతునా నా శైలమన ప్రార్థనా నా శోక మెల్ల దీర్చెడు విశేషమైన ప్రార్థనా.
3.
నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖభార మెల్లను నా దేవుడేసు చెంతకు మోదంబు గొంచు బోవును సదా శుభంబు లొందెడు విధంబు జూప నీవెగా నా ధైర్యమిచ్చు ప్రార్థనా సుధా సుధార ప్రార్థనా.
4.
అరణ్యమైన భూమిలో నా రమ్యమౌ పిస్సా నగరంబు రంగుగాను నెక్కి నా చిర గృహంబు జూతును శరీరమున్ విదిల్చి నే బరంబు బోవు వేళలో కరంబు నిన్ను మెచ్చెదన్ పరేశు ధ్యాన ప్రార్థనా.