FaithWalk
← Back to Library

#383ఆదర్శ ప్రార్థన

Author: UnknownCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
ప్రార్థన వినెడి పావనుడా – ప్రార్థన మాకు నేర్పుమయ్యా || ప్రార్థన ||
1.
శ్రేష్ఠమైన భావము గూర్చి – శిష్యబృందముకు నేర్పితివి పరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక ప్రార్థన నేర్పుమయ్యా || ప్రార్థన ||
2.
పరమ దేవుడవని తెలిసి – కరములు ఎత్తి జంటగా మోడ్చి శిరమును వంచి – సరిగా వేడిన – సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా || ప్రార్థన ||
3.
దినదినము చేసిన సేవ – దైవచిత్తముకు సరిపోవ దీనుడవయ్యు – దిటముగ కొండను – చేసిన ప్రార్థన నేర్పుమయ్యా || ప్రార్థన ||
4.
శత్రుమూక నిను చుట్టుకొని – సిలువపై నిను జంపగను శాంతముతో నీ – శత్రుల బ్రోవగ – సలిపిన ప్రార్థన నేర్పుమయ్యా || ప్రార్థన ||