#382ప్రార్థన
Author: జోనథా బర్డర్Composer/Ragam: జంఝూటిCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
విన్నపము యేసు నాధుడా నా – మనవి నిప్పుడు ఘనమైన నీదు
నెనరుచే నన్ను – గావు మెప్పుడు || విన్నపము ||
1.
ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ – యొక్క పేరటన్ జేరుదురక్కడ నే నక్కడ ఉంటాను
అంటివి || విన్నపము ||
2.
మరియెవరు దిక్కు ధరణిలోన – వేరు లేరుగా దుర్జనుల కెల్లన్
దెలిపి నావు నీవేగా || విన్నపము ||
3.
మరణ మైతివి హాహా నా – కొరకు సిలువపై నీ – కరుణ కలిగె నెంత
యీ దురాత్ముని నాపై || విన్నపము ||
4.
సకలంబు నీదటంచు మదిని – సంతసించెద వేరొకని కించుకంతయైన
నుర్వి లేదుగా || విన్నపము ||
5.
కోరితి నిను దారిగా నన్ను – దూరపరచకు నీ – కూరిమి నా కొసగి
నడుపు – మరణావధికి || విన్నపము ||
6.
వినయంబు సద్గుణంబు చిత్త – మునను గూర్పవే ఘనమైన నీతి యను
భవంబు – గలుగజేయవే || విన్నపము ||
7.
దేవదేవ రావే నిన్ను – సేవ చేయుదు నన్ను – భావనునిగా జేయవే
నే పాప నరుడను || విన్నపము ||