FaithWalk
← Back to Library

#381'నీవు నన్ను ఆశీర్వదించనియెడల నిన్ను వెళ్ళనియ్యను'

Author: పులిపాక జగన్నాధముComposer/Ragam: తోడిCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
నిన్ను నేను విడువను దేవ – నీవు నను దీవించు వరకు నిన్ను నమ్మినవారల నెల్ల – నీవు చక్కగ దీవించెదవు || నిన్ను ||
1.
నేను శత్రువునై యుండంగా – నీవు నాపై నెనరు జూపి దాన మిచ్చితివి నా కొరకు – దారుణుడు నీ ప్రియ పుత్రుని || నిన్ను ||
2.
త్రోవ దప్పి తిరుగుచుండ – దుడుకునైన నన్ను గాని ప్రోవంగోరి మదిని నీవు – త్రోవను బెట్టితివి నన్ను || నిన్ను ||
3.
నాటినుండి నేటివరకు – నాకు గలిగిన శోధనములలో నేటుగా నన్ను గాచిన వాడవవు – నీవు గావా, ఓ నా తండ్రి || నిన్ను ||
4.
ఇంతకాలము నన్ను గాచి – యింకను నన్ను విడువవనుచు సంతసించి మదిని నేను – చక్కగ నీ దరి జేరితిని || నిన్ను ||
5.
నీవు గాక యెవరున్నారు – నేలపై నన్ను గాపాడ చేవలేని నాకు నీవు – చేవగలుగుగ జేయ గలవు || నిన్ను ||
6.
అడుగువారి కిచ్చెద నంచు – నాథుడిచ్చినావు గాన నడిగెద నిన్ను సహాయంబు – నాత్మమై యున్నట్టి తండ్రి || నిన్ను ||
7.
నాదు ప్రార్థనలన్నియు నీవు – నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి నన్ను – నేర్పు దనరగ రక్షించితివి || నిన్ను ||