FaithWalk
Font size:
380

నా యేసు నాథా

Naa Yesu Naathaa

సహాయము కొరకు ప్రార్థన


రేగుప్తి (చేయ: ఖండించవలెను) · త్రిపుట · పులిపాక జగన్నాధము

Raegupti (Chaeya: Khandinchavalenu) · Triputa · Pulipaaka Jagannaadhamu

పల్లవి

నా యేసు నాధా – నన్ను జూడవే – నా జీవనాధ నా యేసు నాధమా – నవ పాప మోచక – నీ యనుగ్రహముచే – నిరతంబు భువిలోన || నా యేసు ||

చరణం 1

వింటిని నేను – నా హృదయంబు – వింత నొందగను – మింటనుండి నీవు – మేదిని కరుదెంచి – యెంటి నర్పించితి – వొనరంగ నా కొరకు || నా యేసు ||

చరణం 2

నీ యాజ్ఞలను – నిజముగా మీరి – నే నుంటి మునుపు – నా యెదను గుందుచు – నా పాపముల కొరకు – నీ యొద్దన్ జేరెద – నిజరక్షకుడ వనుచు || నా యేసు ||

చరణం 3

నేను నీ నెనరు – రుచి జూచితి – నిది యెంతో తనరు – దీనుడనగు నేను – దృఢ కృతజ్ఞత ప్రేమల్ – గానుపింపగ నీ – కడకు వత్తును దేవ || నా యేసు ||

చరణం 4

నేను అశక్తుడను – నిను సేవింప – నిత్యంబు ధరను – గాన ప్రార్థన బూని – ఘనుడవని నమ్ముచు – నాందంబున వత్తు – ననిశంబు నీ దరికి || నా యేసు ||

చరణం 5

దయచేయుమయ్యా – సత్యాత్మను – దాసునికిప్పుడు – దయచేసి శుద్ధాత్మ – ద్వారాగా గల్గించుము – ప్రియముగ నీ సేవ పెంపుచేయగ శక్తి || నా యేసు ||

చరణం 6

నీవు నాతోడ – నెప్పుడుండు – నిజ మొనగూడ – నీవు నాతో నుండ – నిర్భయముగా నేను – త్రోవన్ బోవుదు నీకు స్తోత్రంబు చేయుచు || నా యేసు ||