#379భక్తుని ఆసక్తి
Author: రావూరి లక్ష్మయ్యComposer/Ragam: కాంభోజి (చేయ: చేడియలు గుంపుగూడి)Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
యేసు పరలోక నాయక – సువిశేష సుఫల ప్రదాయక
దోషరహిత ప్రకాశ స్వయం విధి విలాస పరమ నివాస బుధ దేవ || యేసు ||
1.
మంచి మనస్సాక్ష్య మియ్యవే – శ్రమల – నెంచి – కృపల నందియ్యవే
వంచనల – నెడ – లించి మొర చిత్త – గించి మిగుల ర – క్షించుమింక వేగ || యేసు ||
2.
నిరాసుడనని పోనాడక – యొద్దన్ – జేరి నిర్దయ జూడక
సారస తత్కృప లూర నన్ను బ్రోచు – వార లెవ్వ రు – న్నారు నీవు గాక || యేసు ||
3.
కన్నతండ్రి నీ పాదముల్ – పొడ – గన్న వారి హృద్భేదముల్
అన్ని దొలగునని – యన్న శుభరవం – బెన్ని విన్నాడ – నన్నవగు క్రీస్తు || యేసు ||
4.
శంకలను వెడలంగొట్టవే – లోకా – టంకముల నెత్తి మొట్టవే
యింక నా యఘ – పంకమును గృప – నింక గను నిష్క – లంకునిగ జేయు || యేసు ||
5.
దిక్కు నీవని నమ్మితి – నిన్నే – మ్రొక్కు పంతంబు జేసితి
చక్కగా నల పి – శాచి దుర్మోహ – దృక్కణించి నీ – చక్కని జేర్చుమో || యేసు ||