FaithWalk
← Back to Library

#385Lord, I hear of showers of blessing

Author: ఎలిజబెత్ కాడ్నర్Composer/Ragam: అనువాదం: జేకబ్ చేంబర్లేన్Translator: జేకబ్ చేంబర్లేన్Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
యేసు, నీ సదాత్మ వృష్టి భక్తులెల్లవారిపై నీవు కుమ్మరింపగాను నాపై గుమ్మరించుమీ.
1.
|| నన్నునున్, నన్నునున్ నన్నాశీర్వదించుమీ ||
2.
తండ్రి, నన్ను దాటవద్దు పాపినంచు వేడెదన్ నీ మన్నింపు నీదు కృప నా కనుగ్రహించుమీ రక్షకా, నన్ దాటి పోకు నేను నిన్ను నమ్మితిన్ నీదు దయ పూర్తిగాను నాపై గుమ్మరించుమీ. పావనాత్మ, దాటి పోకు నేను గ్రుడ్డివాడను జ్ఞానదృష్టి నాకు నిమ్ము నాకు దైవ శక్తి నీ. మారనట్టి దైవ ప్రేమ క్రీస్తు రక్త పుణ్యము పావనాత్మ ప్రేరణంబు నిండుగాను బోయుమీ. నా హృదయంబును బంధించి నన్నాశీర్వదించుమీ యేసు నీకు సేవచేయ నన్నాశీర్వదించుమీ.