#378ఆదర్శ ప్రార్థనలు
Author: యు.ఎ. భాసిలామణిComposer/Ragam: కమాసు (చేయ: ఇడుగో గొర్రెల కాపరి)Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
శాప భయమును నేడుచు – దావీదు – తన – పాప రూపము ఎంచుచు
తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని – ప్రాపు గోరగానే క్షమాపణ నొందిన || కరుణా ||
1.
కాయమున వెత నోర్చుచు – యోధుడు పౌలు – సాయమీ ధర గోరుచు
రోయుచు ధనముల్ – నియ్యమని ప్రార్థించి – వేరు రెట్లుగ కృపయు – పాయముగ నొందిన || కరుణా ||
2.
దినమంత పని చేయుచు – నాధుడు యేసు – జనుల బాధల మోయుచు
ఇనుడు మరుగౌ వేళ – జనకుని కడకేగి – మనసార విశ్రాంతి – యనుభవించిన స్థలము || కరుణా ||
3.
ఇల బ్రతుకంతయు ప్రార్థన – ప్రభు యేసునకు – సిలువ తన్ తుది ప్రార్థన
చెలువగ విజ్ఞాపనలు జేయుచును మనపై – గల కాలమును దీవెనలు వర్తించెడి చోటు || కరుణా ||