#377క్రీస్తునందలి అభయము
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: హుసేనిCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
నన్ను గన్నయ్య రావే నా యేసు – నన్ను గన్నయ్య రావే ప్రభువా || నన్ను ||
1.
ముందు నీ పాదారవిందము – లందు నిశ్చల భక్తి ప్రేమను
పొంది హాయిగా జేయ రావే నా – డెంద మానంద మనంతమై యుప్పొంగ || నన్ను ||
2.
హద్దులేనట్టి దురాశల – నవివేకినై కూడి యాడితి
మొద్దులతో నింక కూటమి – వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి || నన్ను ||
3.
కాలము పెక్కు గతించెను – గర్వాదులెడ దెగవాయెను
ఈ లోక మాయ సుఖేచ్ఛలు – చాలును చాలును చాలునో తండ్రి || నన్ను ||
4.
దారుణ సంసార వారధి – దరి జూపి బ్రోవ నీ కన్నను
కారణ గురువు ఇంకెవరు – లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి || నన్ను ||
5.
నా వంటి దుష్కర్మజీవిని – కేవలమగు నీదు పేర్మిని
దీవించి రక్షింప నిప్పుడే – రావయ్య రావయ్య రావయ్య తండ్రి || నన్ను ||