FaithWalk
Font size:
376

దేవా సహాయము నిమ్మా

Daevaa Sahaayamu Nimmaa

దైవసహాయము కొరకు ప్రార్థన


నాథనామక్రియ (చేయ: యెహోవా భజన) · అట · మిక్కిలి దైవసహాయము

Naathanaamakriya (Chaeya: Yehovaa Bhajana) · Ata · Mikkili Daivasahaayamu

పల్లవి

దేవా సహాయము నిమ్మా – జీవంపుటూటలు ద్రావుట కిమ్మా || దేవా ||

చరణం 1

గడియ గడియకు నెగసె నమ్ము – లెంతో – వడిగా నాపై వచ్చె నరక బాణములు – యెగతెగని శోధనములు నీవు – పడగొట్టి వేగమే – దృఢభక్తి నిమ్మా || దేవా ||

చరణం 2

కోటానకోటి కష్టములు – నాకు – మాటిమాటికి వచ్చె మరి నికృష్టములు సాతాను సాధనములు – నేను – దాటి నీ రెక్కల – చాటున నుండ || దేవా ||

చరణం 3

దారా పుత్రుల పైన భ్రమలు – నన్ను సారె సారెకు నీడ్చు లోక భాగ్యములు ఘోరముగు నాత్మకములు – న – హ్నిన్ని రీతి భ్రమ పెట్టు ధారుణిలోన || దేవా ||

చరణం 4

మా యావత్ దినములు – చెట్టు – ఛాయవలె నరుగుచు మంటి పాలౌను – చాలు నీ లోకంబు మేలు – మేము – పరలోకరాజ్యము – చేరుట మేలు || దేవా ||

చరణం 5

మంచి మరణం బిమ్ము దేవ – మమ్ము – వంచించు – సాతాను వల నుండి కావ నెంచి దూతలను పంపినావా – మాకై – పంచ గాయములొంద – ప్రభు వచ్చినావా || దేవా ||