#375కృప కొరకు ప్రార్థన
Author: పులిపాక జగన్నాధముComposer/Ragam: శ్రీరాగము (చేయ: కలుగునుగాక దేవునికి మహిమ)Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
నా యఘములు అన్నియు – నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే – నీ సుతుని కృతమున || నాలించు ||
1.
నీ యాజ్ఞ లన్నియు – నేను చక్కగ సల్ప – నీ యందు నమ్మిక – నెగడించుమనిశంబు || నాలించు ||
2.
నీ సేవ నొనరింప – నిండుగ నిలలోన – నీ సేవకుని కమ్ము – నీ శుద్ధాత్మను కృపచే || నాలించు ||