FaithWalk
← Back to Library

#374ప్రభు ప్రార్థన

Author: మల్లెల దావీదుComposer/Ragam: కేదారCategory: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
పరము నందుండెడు మా – పరమ జనక నీదు పేరు పరిశుద్ధంబగును గాక – త్వరగను నీ రాజ్యంబు – ధరకునే రుగుదెంచుగాక పరమునందు నెట్టులనో – ధరణియందు నట్లు నీ చి – త్తంబు నెరవేరుగాక || పరము ||
1.
మా యనుదినాహారము – మాకు నేడు దయచేయుము – మా యెడలను దప్పిదముల – జేయువారి నైచునటుల మాయపరాధము క్షమించి – మమ్ము శోధనలోకి దేక – మహిని గీడు నుండి నీ స – హాయమున దప్పించుము రా – జ్యమ్ము శక్తి మహిమము నె – ల్లప్పుడును నీవే యామెన్ || పరము ||